నిన్నటి కేసీఆర్ గారి బస్సు యాత్రను విజయవంతం చేసిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు నా ధన్యవాదాలు
– మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఖానాపూర్ మండలం
బుధరావుపేట గ్రామంలోని ఈదుల చెరువు వద్ద బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి “మాలోత్ కవిత” మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.
_ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.- గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ హామీల మీద ప్రజలు పూర్తి విశ్వాసం కోల్పోయారు- ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు అని అన్నారు.- గతంలో జరిగిన పొరపాటును ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ జరగనీయమని స్వచ్ఛందంగా ప్రజలు తెలియజేస్తున్నారన్నారు..- గతంలో మేము మోసపోయామని, కేసిఆర్ ఉంటేనే బాగుండు అని .. బుధరావుపేట చెరువు ఎప్పుడు ఎండిపోలేదు అని.. గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ వల్ల ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.- మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన ఆడబిడ్డను మంచి మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు దీమా వ్యక్తం చేశారు.- కేవలం ఓట్ల కోసమే మోసపూరిత హామీలను ఇచ్చి.. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా కనీసం ప్రజలకు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండటం సిగ్గుచేటు అని తెలిపారు.
ఈరోజు రైతు బంధునే ఇవ్వని కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ఎలా చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు..
-ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో కలిసి కాసేపు పని చేసిన అనంతరం కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది..
-పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ వచ్చినట్లయితే పార్లమెంటులో మాలోత్ కవిత గారు ప్రశ్నించే గొంతుక అవుతారు…- కాబట్టి కారు గుర్తుకు ఓటేయండి.. అభివృద్ధికి మళ్లీ అవకాశం ఇవ్వండి..
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిపి, జెడ్పిటిసి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపిటిసిలు, తాజా మాజీ సర్పంచ్ లు, క్లస్టర్ భాద్యులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.