Awareness of women empowerment for employment guarantee workers In view of dry season, “O.R.S. Distribution of packets”

Awareness of women empowerment for employment guarantee workers

ఉపాధి హామీ కూలీలకు మహిళా సాధికారతపై అవగాహన…**ఎండాకాలం దృష్ట్యా ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు పంపిణీ*——————-పెద్దపెల్లి, మే-1 తెలంగాణ నుండి ఫోకస్ ప్రతినిధి : ——————-పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో బుధవారం ఉపాధి హామీ కూలీలతో మహిళా సాధికారిత, గ్రామాభివృద్ధి కొరకై ప్రతి ఒక్కరూ తోడ్పడాలని మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్స్ లిటరసి ఎస్.సంద్య అన్నారు.*మహిళా సాధికారత కేంద్రం కో-ఆర్డినేటర్ దయా అరుణ, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్స్ లిటరసి ఎస్.సంద్య మాట్లాడుతూ,* మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత, సైబర్ నేరాల పైన అవగాహన కలిగి ఉండాలని, అలాగే బాలికల చదువు ప్రాముఖ్యత, బాల్య వివాహాల నిషేధం గురించి వివరిస్తూ,పని ప్రదేశాలల్లో మహిళలపై హింస, దాడులు జరిగినప్పుడు సంప్రదించవలసిన హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్స్, సఖీ కేంద్రం సేవలు, అంగన్వాడి సేవలు, చైల్డ్, వయోవృద్ధులు, వికలాంగుల సంరక్షణ అంశాలపై అవగాహన కల్పించారు.అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లబ్ధి, బీమా పథకాలపైన అవగాహన కల్పిస్తూ వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అనంతరం ఎండాకాలం దృష్ట్యా ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, ఉపాధి హామీ కూలీలకు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సి.హెచ్.శ్రీదర్, ఫీల్డ్ అసిస్టెంట్ సంపత్, అంగన్వాడీ టీచర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.—————————————————జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *